punjab: కరోనా ప్రభావం: పంజాబ్ సెంట్రల్ వర్సిటీలో తెలుగు విద్యార్థులకు ఇబ్బందులు
- 48 గంటల్లో హాస్టల్ ఖాళీ చేయాలన్న అధికారులు
- టిక్కెట్లు దొరక్క విద్యార్థుల ఇబ్బందులు
- వర్సిటీలో 60 మంది తెలుగు విద్యార్థులు
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు విశ్వవిద్యాలయాల హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లాలని విద్యార్థులకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీలోని హాస్టల్‌ను 48 గంటల్లో మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆ హాస్టల్‌లో దాదాపు 60 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. వారికి రైళ్లతో పాటు ప్రైవేటు ట్రావెల్స్‌లో రిజర్వేషన్లు దొరకట్లేదు. దీంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధిక ధరలకు ప్రయాణ టిక్కెట్లు కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు.