Ram Gopal Varma: 'అరేయ్ కేఏ పాల్' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ
- తన ఛారిటీ గదులను కరోనా బాధితుల కోసం వాడుకోవచ్చంటూ తెలుగు సీఎంలకు పాల్ ఆఫర్
- సుత్తి సలహాలు ఇవ్వొద్దన్న వర్మ
- కరోనాను తీసేయమని దేవుడితో చెప్పొచ్చు కదా అంటూ ఎద్దేవా
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లకు క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ సమీపంలోని 25 ఎకరాల్లో తమ ఛారిటీకి 100 గదులు ఉన్నాయిని... అలాగే హైదరాబాదుకు సమీపంలో ఉన్న సంగారెడ్డిలో 300 గదులు ఉన్నాయని... కరోనా బాధితుల కోసం ఈ గదులను ఉచితంగా వాడుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ఆఫర్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు.
'అరేయ్ కేఏ పాల్... ఈ సుత్తి సలహాలను ఇచ్చే బదులు.. నీ దేవునితో చెప్పి కరోనాను తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బారావ్. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే... నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేటట్టు చేయి ఎంకమ్మా' అంటూ ట్విట్టర్ ద్వారా పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేఏ పాల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.