Kamal Nath: రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌

Kamal Nath resigns as Madhya Pradesh Chief Minister ahead of trust vote

  • మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు సాయంత్రం బలపరీక్ష
  • బలపరీక్షకు ముందే కమల్‌నాథ్ రాజీనామా 
  • పార్టీ హై కమాండ్‌ సూచనల వల్లే?

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నేడు కాంగ్రెస్ నేత, సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కోవాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే, కమల్ నాథ్ రాజీనామా చేయాలని ఆ పార్టీ కమాండ్ నుంచి కీలక ఆదేశాలు అందాయని ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది. సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా చేశారు.

మధ్యప్రదేశ్‌లో 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ మెజారిటీని కోల్పోవడంతో ఆయన బలపరీక్ష ఎదుర్కోక ముందే రాజీనామా చేయడం గమనార్హం. తన అధికారిక నివాసం నుంచి కమల్‌నాథ్ గవర్నర్‌ లాల్జీ లాండన్ వద్దకు బయలుదేరారు.

తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించనున్నారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. 15 నెలల తమ ప్రభుత్వంలో తాము ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఎన్నో విధాలుగా ప్రయత్నించిందని తెలిపారు.

  • Loading...

More Telugu News