Local Body Funds: కరోనా ఎఫెక్ట్... స్థానిక సంస్థల నిధులు విడుదల చేసిన కేంద్రం

Centre releases local body funds to tackle corona outnreak

  • ఆరు రాష్ట్రాలకు స్థానిక నిధులు
  • రూ.2,570 కోట్లు విడుదల చేసిన కేంద్రం
  • ఏపీకి రెండు విడతల నిధుల విడుదల

స్థానిక సంస్థల నిధులు విడుదల చేయాలంటూ ఏపీ సహా అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికలతో నిధుల విడుదలను ముడివేసిన కేంద్రం ఇప్పటివరకు నెట్టుకొచ్చింది. అయితే కరోనా భూతం తరుముకొచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థల నిధులు విడుదల చేయకతప్పలేదు. కరోనా నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పారిశుద్ధ్య పనుల కోసం కేంద్రం ముందుగానే నిధులు విడుదల చేసింది.

ఏపీ, తమిళనాడు, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు ఈ నిధులు విడుదల చేశారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఏపీకి 2018-19 ఏడాదికి గాను రెండో విడత నిధుల కింద రూ.870.23 కోట్లు విడుదల చేశారు. అంతేకాదు, ఏపీకి 2019-20 ఏడాది మొదటి విడత నిధుల కింద రూ.431 కోట్లు విడుదల చేశారు. మొత్తం ఆరు రాష్ట్రాలకు కేంద్రం రూ.2,570 కోట్లు విడుదల చేసింది.

  • Loading...

More Telugu News