New Delhi: లాక్‌డౌన్‌కు మద్దతిచ్చి మీ కుటుంబాలను కాపాడుకోండి: అరవింద్ కేజ్రీవాల్

support the lockdown to protect your families urges Arvind Kejriwal

  • ఢిల్లీలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది
  • కాలుష్య నియంత్రణకు సహకారం అందించారు
  • ఇప్పుడు కరోనాపై పోరాటంలోనూ పాల్గొనండి 

కరోనాపై యుద్ధంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో లాక్‌డౌన్‌ మొదలైంది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.

‘ఢిల్లీలో ఈ రోజు లాక్‌డౌన్‌ మొదలైంది. ఢిల్లీ ప్రజలారా, ఇదివరకు కాలుష్య నియంత్రణలో భాగంగా ‘సరి, బేసి’ విధానం అమలు చేసినప్పుడు మీరు కొంత ఇబ్బంది పడ్డారు. అయినా దానికి సహకారం అందించారు. డెంగ్యూపై వ్యతిరేక పోరాటంలోనూ పాలు పంచుకున్నారు. ఇప్పుడు కరోనాపై యుద్ధంలో కూడా మీరు భాగం అవుతారని నేనెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నా. లాక్‌డౌన్‌కు మద్దతు తెలిపి మీ కుటుంబాలను కాపాడుకుంటారని ఆశిస్తున్నా’అని కేజ్రీవాల్ సోమవారం ఉదయం ట్వీట్ చేశారు.

ఢిల్లీలో ఇప్పటిదాకా 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు చనిపోయారు. వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రజా రవాణాను నిలిపివేసిన ఢిల్లీ సర్కారు రాష్ట్ర సరిహద్దులను కూడా మూసేసింది. అదే విధంగా నిత్యావసరాలను మినహాయించి ఇతర దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News