Donald Trump: అమెరికాలో పెరుగుతున్న కరోనా మరణాలు... చైనాను నిందిస్తున్న ట్రంప్

More corona deaths in USA as Trump fired on China again

  • అగ్రరాజ్యంలో కరోనా బాధితుల సంఖ్య 33,546
  • 419 మంది మృతి
  • ఒక్కరోజులోనే 100 మరణాలు
  • ట్రంప్ అసహనం

చైనా, ఇటలీ తర్వాత కరోనా బాధితులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికానే. ఇప్పుడక్కడ 33,546 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులున్నారు. మృతుల సంఖ్య 419. అయితే, ఒక్క రోజు వ్యవధిలో 100 మరణాలు చోటుచేసుకోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై నిప్పులు కురిపించారు.

 సకాలంలో చైనా తమతో సమాచారం పంచుకోని కారణంగానే ఈ మహమ్మారి విజృంభిస్తోందని ఆరోపించారు. మొదట్లోనే చైనా ఈ వైరస్ గురించి తమకు సమాచారం అందించి ఉంటే బాగుండేదని, చైనా వైఖరి తమకు అసంతృప్తిని కలిగించిందని అన్నారు. కానీ తాను చైనాలా ఎప్పటికీ వ్యవహరించనని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, అమెరికాలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అత్యధికులు ఇళ్లకే పరిమితమయ్యారు.

  • Loading...

More Telugu News