Narendra Modi: కరోనా నిధికి ఆఫ్ఘనిస్థాన్ విరాళం.... కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ

Afghanistan donates one million dollars to Covid fund as PM Modi praised Afghan

  • దక్షిణాసియా దేశాలకు సంఘీభావం ప్రకటించిన ఆఫ్ఘనిస్థాన్
  • కొవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్ కు ఒక మిలియన్ డాలర్ల విరాళం
  • ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నిర్ణయాన్ని స్వాగతించిన మోదీ

చైనాను అతలాకుతలం చేసి ఇతర దేశాలపై పడిన కరోనా మహమ్మారి ధాటికి ఆసియా దేశాలు కూడా అల్లాడిపోతున్నాయి. అయితే ఆసియా దేశాలు కరోనాపై ఉమ్మడిగా పోరాడాలన్న ప్రధాని మోదీ పిలుపునకు సానుకూల స్పందన వస్తోంది.

ఈ క్రమంలో కొవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్ కు ఆఫ్ఘనిస్థాన్ ఒక మిలియన్ డాలర్ల ఆర్థికసాయం ప్రకటించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 'థాంక్యూ ఆఫ్ఘనిస్థాన్' అంటూ స్పందించారు. "దక్షిణాసియా దేశాలకు సంఘీభావం ప్రకటిస్తూ భారీ విరాళం ప్రకటించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను" అంటూ ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

అటు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు గోతబయ రాజపక్సలకు కూడా మోదీ ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ కొవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్ కు 1.5 మిలియన్ డాలర్లు ప్రకటించగా, శ్రీలంక సార్క్ కొవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్ కు 5 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం ప్రకటించింది.

  • Loading...

More Telugu News