Sriharikota: కరోనా ఎఫెక్ట్: శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం మూసివేత
- ఈ నెల 31వరకు షార్ లో కార్యకలాపాల నిలిపివేత
- అత్యవసర విభాగాల ఉద్యోగులకు మినహాయిపు
- షార్ లో నిర్మాణ పనులు సైతం బంద్
కరోనా మహమ్మారి అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతోంది. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థలు సైతం కుప్పకూలిపోతున్నాయి. తాజాగా, శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రంపైనా కరోనా ప్రభావం పడింది. ఈ నెల 31 వరకు శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కార్యక్రమాలు నిలిపివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో షార్ ను అధికారులు షట్ డౌన్ చేశారు. అత్యవసర విభాగాల ఉద్యోగులు మాత్రమే హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బంది కోసం నిర్దేశించిన జనరల్ షిఫ్ట్ బస్సులను రద్దు చేశారు. షార్ కేంద్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను సైతం నిలిపివేశారు.