Senior Citizens: ఇటలీ తన వృద్ధులను ఎలా రక్షించుకోవాలో చెప్పిన ఇజ్రాయిల్!

Israel Tips to Italy for Senior Citizens

  • వృద్ధులను రక్షించడంలో విఫలమవుతున్న ఇటలీ
  • పెద్దలకు యువకులు దూరంగా వుండాలి 
  • కొన్ని నెలల పాటు విధిగా పాటించాలని సూచన

తమ దేశంలో కరోనా వైరస్ బారిన పడుతున్న వృద్ధులను రక్షించే ప్రయత్నాలను చేయడంలో ఘోరంగా విఫలమవుతున్న ఇటలీలో, పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్న పరిస్థితులలో, ఇజ్రాయిల్ రక్షణ మంత్రి నఫ్తాలీ బెన్నెట్ కొన్ని కీలక సూచనలు చేసింది. ప్రపంచమంతా వాటిని అనుసరిస్తే, వయసు మళ్లిన వారిని వైరస్ బారి నుంచి కాపాడుకోవచ్చని అన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

ఇళ్లలో పెద్ద దిక్కుగా ఉన్న వారిని కాపాడుకోవాలంటే కొన్ని పనులు చేయడం తప్పనిసరని ఆయన అన్నారు. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వవద్దని, ఎప్పటికప్పుడు మాస్క్ లను ధరించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు. ఇంకో ముఖ్యమైన విషయంగా యువతీ యువకులను, వృద్ధులతో కలవనీయకుండా చేయాలని, 70 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సున్న వారికి కరోనా సోకితే ప్రతి ఐదుగురిలో ఒకరు మరణిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

పెద్దవారిని చూసినప్పుడు ప్రేమతో కౌగిలించుకోవడం అలవాటే అయినా, ప్రస్తుతం అలా చేయవద్దని, ఏదైనా ఆహారం వారికి ఇవ్వాలని వెళితే, కనీసం మూడు మీటర్లు దూరంగా ఉండాలని నఫ్తాలీ బెన్నెట్ సూచించారు. కొన్ని నెలల పాటు ఇలా చేస్తే, వైరస్ వ్యాప్తి ప్రమాదం తగ్గుతుందని ఆయన భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News