Spain: స్పెయిన్లో ఒక్కరోజే 738 మంది మృతి
- మరణాల్లో చైనాను దాటేసిన స్పెయిన్
- ప్రపంచవ్యాప్తంగా 16 వేలు దాటిన మరణాలు
- ఒక్క ఇటలీలోనే 6 వేల మంది మృతి
స్పెయిన్లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే అక్కడ ఏకంగా 738 మందిని కరోనా బలితీసుకున్నట్టు స్థానిక పత్రికలు తెలిపాయి. స్పెయిన్లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరణాల్లో ఆ దేశం చైనాను దాటిపోయింది. చైనాలో 3,285 మంది మాత్రమే మరణించగా, స్పెయిన్లో ఏకంగా 3,434 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 16 వేలు దాటిపోయింది. 4.40 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క ఇటలీలోనే అత్యధికంగా 6 వేల మంది మరణించారు. ఇక, కరోనా వైరస్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచదేశాలన్నీ దాదాపు లాక్డౌన్ ప్రకటించాయి. భారత్ కూడా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్లోకి వెళ్లిపోయింది.