Corona Virus: కరోనాపై... రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడిన నరేంద్ర మోదీ!

Putin Talks with Modi over Corona

  • కరోనాపై అభిప్రాయాలు పంచుకున్న ఇరు నేతలు
  • భారత్ చర్యలు సంతృప్తికరమన్న పుతిన్
  • కరోనా నుంచి బయటపడుతుందన్న ఆశాభావం

కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ లో మాట్లాడుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ పరిస్థితిపై వీరిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని రష్యాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రష్యాలో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ, వైరస్ పై రష్యా చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఇదే సమయంలో ఇండియా తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఇండియాలో నామమాత్రపు ప్రభావంతోనే వైరస్ కట్టడి అవుతుందన్న ఆశాభావాన్ని పుతిన్ వ్యక్తం చేశారు. కరోనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సేవలు, ఔషధాలు, టీకా కోసం సైంటిఫిక్ రీసెర్చ్ తదితరాలను మానవతా దృక్పథంతో ఇతర దేశాలకు అందించాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు.

  • Loading...

More Telugu News