central: కిషన్ రెడ్డి, నిర్మలకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పర్యవేక్షణ బాధ్యతలు

 Kishan Reddy and Nirmal are in charge of corona monitoring in Telugu states

  • తెలంగాణ 33 జిల్లాల అధికారులతో కిషన్ రెడ్డి సమన్వయం
  • ఏపీలో 13 జిల్లాలను పర్యవేక్షించనున్న నిర్మల
  • ఎప్పటికప్పుడు అధికారులకు తగిన సూచనలు

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించేందుకు ఇద్దరు మంత్రులను కేంద్రం రంగంలోకి దింపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని 33 జిల్లాల అధికారులతో కిషన్ రెడ్డి సంప్రదింపులు జరపనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అధికారులతో సమన్వయం చేసే బాధ్యతను నిర్మల తీసుకోనున్నారు.

కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా అధికారులతో చర్చించి వీరిద్దరూ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు. వాటి ఆధారంగా అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగాలకు తగిన సూచనలు ఇవ్వాలని కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటిదాకా 45 కేసులు నమోదవగా, ఏపీలో 11 మందికి కరోనా వైరస్‌ సోకింది.

  • Loading...

More Telugu News