Kollywood: ప్రభుత్వం చెప్పింది అర్థం చేసుకోండి.. హాస్యనటుడు వడివేలు కన్నీళ్లతో వేడికోలు!
- ప్రభుత్వ ఆంక్షలు బేఖాతరు
- ఇంటి పట్టున ఉండకుండా రోడ్లపైకి జనం
- తేలిగ్గా తీసుకోవద్దంటూ వడివేలు ఆవేదన
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలంటూ ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు వడివేలు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరాడు. వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారని, వారందరికీ సహకరించాలని విజ్ఞప్తి చేశాడు.
వైరస్ ప్రభావం తగ్గేంత వరకు అందరూ కొంతకాలం పాటు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా కొందరు బయట తిరుగుతుండడంతో వడివేలు ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వానికి, కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వారికి, పోలీసులకు అందరూ సహకరించాలని కోరాడు. తాజా పరిణామాలు తనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని అన్నాడు. పిల్లాపాపలతో అందరం ఇంట్లోనే ఉందామని, దీనిని ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.