Jagan: రాష్ట్రంలో మూడుసార్లు బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తాం: సీఎం జగన్
- పేదలకు బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ
- ఏప్రిల్ 1నే పెన్షన్లు ఇస్తామన్న సీఎం జగన్
- ఏప్రిల్ 4న పేదలకు రూ.1000 చొప్పున ఇస్తామని వెల్లడి
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఏపీలోనూ లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు మూడు సార్లు నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా ఆదివారం నాడు బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేయనున్నారు. ఆపై ఏప్రిల్ 15న మరోసారి బియ్యం, కేజీ కందిపప్పు ఇస్తారు. ఏప్రిల్ 29న మూడో విడతగా బియ్యం, కేజీ కందిపప్పు అందిస్తారు. అంతేగాకుండా, ఏప్రిల్ 1నే రాష్ట్రంలో పింఛన్లు ఇస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ఏప్రిల్ 4న పేదలకు రూ.1000 చొప్పున ఇస్తామని తెలిపారు.