India: ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం.. భారత్ మాత్రం సేఫ్: ఐక్యరాజ్యసమితి కీలక నివేదిక
- కరోనాతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది
- ప్రపంచం ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకొనే అవకాశం
- ఆదుకోవడానికి 2.5 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ అవసరం
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది
కరోనాతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. దీంతో ప్రపంచం ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకొనే అవకాశముందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి 2.5 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ అవసరముంటుందని పేర్కొంది.
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కరోనా షాక్ పేరుతో ఐరాస ట్రేడ్ రిపోర్ట్ విడుదల చేసింది. అయితే, ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం భారత్, చైనాలకు మాత్రం ఉండకపోవచ్చని తెలిపింది. వస్తువుల ఎగుమతులపై ఆధారపడిన అభివృద్ధి చెందుతోన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్లీ నిలదొక్కుకోవాలంటే రానున్న రెండేళ్లలో రెండు నుంచి మూడు ట్రిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని, ఈ నేపథ్యంలోనే దేశాలు మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని వివరించింది.