Kerala: డాక్టర్ చీటీ ఉంటే మద్యం సరఫరా చేయచ్చన్న నిర్ణయాన్ని తప్పుబట్టిన కేరళ హైకోర్టు!
- లాక్ డౌన్ కారణంగా మద్యం బంద్
- కేరళలో ఎనిమిది మంది ఆత్మహత్య
- డాక్టర్ అనుమతి ఉంటే మద్యం సరఫరాకు సీఎం నిర్ణయం
- హైకోర్టును ఆశ్రయించిన ఉద్యమకారులు, ఐఎంఏ
లాక్ డౌన్ కారణంగా మద్యపాన ప్రియుల పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్ రికమెండ్ చేస్తూ ప్రిస్క్రిప్షన్ ఉంటే మద్యం అమ్మచ్చని కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశించారు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు ఉద్యమకారులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధులు హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు వారాల పాటు ఎలాంటి అమ్మకాలు జరపరాదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా, రాష్ట్రంలో మద్యం దొరక్క 8 మంది చనిపోయారంటూ ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. అయితే, డాక్టర్ అనుమతితో మద్యం అమ్మకాల నిర్ణయం కలవరపాటుకు గురిచేసేలా ఉందని, అది వినాశ హేతువు అని పేర్కొంది. పైగా ఇలాంటి నిర్ణయాలను ఏ శాస్త్రీయ అధ్యయనం కూడా సమర్థించబోదని హైకోర్టు అభిప్రాయపడింది.