kvp ramachandra rao: వైఎస్సార్ తెచ్చిన ఆ చట్టాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలి: కేవీపీ
- వైద్యులపై దాడులు బాధాకరం
- వైద్యులపై దాడుల నియంత్రణకు 2007లో వైఎస్ చట్టం తెచ్చారు
- ఇబ్బందులలో ఉన్న వారిని కాంగ్రెస్ కార్యకర్తలు ఆదుకోవాలి
హైదరాబాద్లో కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పందించారు. వైద్యులపై దాడులు ఆగాలంటే 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన చట్టాన్ని మళ్లీ అమలు చేయాల్సిందేనని అన్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.
తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న రోగులపై దాడులు జరగడం బాధాకరమన్న ఆయన, దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు అనుసరించాలని కోరారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం ఈ ఆపత్కాలంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి కార్యకర్తలు సేవలు అందించాలని కేవీపీ సూచించారు.