Corona Virus: ఐదు రోజుల సడలింపుతో మూడు దశల లాక్ డౌన్ అమలు చేయాలంటున్న కేంబ్రిడ్జ్ విద్యావేత్తలు!

Cambridge experts says India needs three tire lock down

  • భారత్ లో 21 రోజుల లాక్ డౌన్
  • పొడిగించే ఉద్దేశం లేదంటున్న కేంద్రం!
  • కేంబ్రిడ్జ్ విద్యావేత్తల ఆసక్తికర అధ్యయనం

భారత్ లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా, పొడిగించే ఉద్దేశం లేదని కేంద్రం సంకేతాలు ఇస్తోంది. అయితే కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన రాజేశ్ సింగ్, ఆర్. అధికారి అనే విద్యావేత్తలు చేసిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు నివేదించారు. భారత్ లో ఒక లాక్ డౌన్ సరిపోదని, మూడు దశల లాక్ డౌన్ విధించాలని పేర్కొన్నారు. అప్పుడే కరోనా మహమ్మారిని నియంత్రించడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. 21 రోజుల లాక్ డౌన్ పూర్తయ్యాక ఐదు రోజుల విరామం ఇచ్చి రెండో దశలో 28 రోజుల లాక్ డౌన్  ప్రకటించాలని సూచించారు.

మొదటి దశ లాక్ డౌన్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిస్తుందని, అయితే కరోనా వ్యాప్తిని వాస్తవిక దృక్పథంతో చూడాలని, మళ్లీ వ్యాపించే అవకాశం ఉన్నందున మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తే మరికొంత ఉపయోగం ఉంటుందని వివరించారు. తగ్గిన కేసుల ఆధారంగా వైరస్ పునరుజ్జీవనాన్ని అంచనా వేయలేమని తెలిపారు. రెండో దశ లాక్ డౌన్  పూర్తయ్యాక మరో 5 రోజుల విరామం ఇచ్చి ఈసారి 18 రోజుల లాక్ డౌన్ ప్రకటించాలని సూచించారు.  మూడో విడత అనంతరం పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదవుతుందని, మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గుతుందని రాజేశ్ సింగ్, అధికారి తమ అధ్యయనంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News