Corona Virus: మర్కజ్ నుంచి వచ్చినవారిలో 172 మందికి కరోనా నిర్ధారణ అయింది: సీఎం కేసీఆర్

CM KCR reveals corona status

  • కరోనా మనదేశంలో పుట్టినజబ్బు కాదన్న కేసీఆర్
  • 22 దేశాల్లో పూర్తిగా లాక్ డౌన్ విధించారని వెల్లడి
  • తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది చనిపోయారని వివరణ

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వైరస్ వ్యాప్తిపై హైదరాబాద్ ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా మనదేశంలో పుట్టిన జబ్బు కాదని అన్నారు. విదేశాల్లో జన్మించిన వైరస్ ఇక్కడికి కూడా వ్యాపించిందని తెలిపారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 11 మంది చనిపోయారని వెల్లడించారు. ప్రస్తుతం 308 మంది కరోనా బాధితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 364 అని తెలిపారు. కాగా, చనిపోయిన వారందరూ మర్కజ్ కు వెళ్లొచ్చినవారేనని వివరించారు.

విదేశాల నుంచి వచ్చిన 25,937 మందిని క్వారంటైన్ చేశామని, వారిలో 50 మందికి పాజిటివ్ అని తేలిందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 30 మందికి, వారి కుటుంబ సభ్యులు 20 మందికి వ్యాధి సోకింది. ఇక ఢిల్లీలోని మర్కజ్ నుంచి వచ్చినవారిలో 1089 మందిని అనుమానితులుగా భావించి వైద్యపరీక్షలు చేస్తే 172 మందికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపారు. ఆ 172 మంది మరో 93 మందికి అంటించారని సీఎం చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని, 22 దేశాల్లో పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News