Suhasini: మా అబ్బాయి తండ్రిని చూసి 20 రోజులైంది: సుహాసిని భావోద్వేగం... వీడియో ఇదిగో!

Suhasini Video on Social Distancing

  • మార్చి 18న లండన్ నుంచి వచ్చిన సుహాసిని తనయుడు నందన్
  • అప్పటి నుంచి హోమ్ క్వారంటైన్ లోనే
  • సోషల్ డిస్టెన్స్ తప్పనిసరన్న సుహాసిని

కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే, ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని సీనియర్ సినీ నటి సుహాసిని వ్యాఖ్యానించారు. లండన్ నుంచి మార్చి 18న వచ్చిన తన కుమారుడు నందన్, ఇంతవరకూ ఎవరినీ కలవకుండా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారని తెలిపారు.

తాజాగా, ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆమె, "అందరికీ నమస్కారం. ఇంట్లో లాక్ డౌన్ లో మనమందరం ఉన్నాం. కానీ ధైర్యంగా ఉండాలి. భయపడవద్దు. ఈ కరోనా వైరస్ మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టింది. పెద్దలు, చిన్నారులు, పేదలు, ధనికులు, రాజకీయ నాయకులు... ఎవరినీ వదలలేదు.

ఇప్పుడు ఎవరికివారు వారి సేఫ్టీని చూసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేయాలి. చేతులు కడుక్కోవాలి. షాపుకి వెళితే ఒక్కరే వెళ్లండి. సహనంతో ఉండాలి. ఈ లాక్‌ డౌన్ పీరియడ్ లో ఇంట్లో ఉండండి. ఫ్యామిలీతో గడపండి. నవ్వుతూ గడపండి. ప్లీజ్... మిమ్మల్ని అడుగుతున్నాను.

మా బాబు నందన్ మార్చి 18న లండన్ నుంచి వచ్చాడు. కానీ ఇంత వరకు పైకి వచ్చి ఫాదర్ ని చూడలేదు. తాతయ్యనీ చూడలేదు. అమ్మమ్మనీ చూడలేదు. ఆ సోషల్ డిస్టెన్స్ ని మెయిన్ టైన్ చేస్తూ, అలాగే ఉన్నాడు. ఎందుకంటే, మా నాన్నకి 90 ఏళ్లు, అమ్మకి 75. వాళ్లని ఇంకా ఆరోగ్యంగా నేను చూడాలి. అలా చూడాలంటే, సోషల్ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేయాలి. మా బాబు సోషల్ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేయాలి. సో... ప్లీజ్... ప్లీజ్ స్టే హోమ్" అని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News