Chandrababu: వైద్యుడు సుధాకర్ రావు సస్పెన్షన్ పై తీవ్రంగా స్పందించిన చంద్రబాబునాయుడు
- అతని వ్యాఖ్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది
- వైద్య సేవలు చేసే యోధులను ఈ విధంగా అగౌరవపరుస్తారా?
- వారిపై శ్రద్ధ కనబర్చండంటూ సీఎం జగన్ కు హితవు
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ రావును రాష్ట్ర వైద్య విధాన పరిషత్ సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఆ ఆసుపత్రిలో మాస్క్ లు, గ్లోవ్స్ కొరత ఉందన్న విషయాన్ని చెప్పిన సుధాకర్ వ్యాఖ్యలపై స్పందించి, చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేయడం షాక్ కు గురిచేస్తోందని అన్నారు.
వైద్య సేవలు అందించే యోధులను ఈ విధంగా అగౌరవపరిస్తే, ఇక బాధితులను రక్షించే క్రమంలో వారిలో ఏ విధంగా జగన్ స్ఫూర్తిని నింపుతారని ప్రశ్నించారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో వైద్యులను, వైద్య సిబ్బందిని కచ్చితంగా కాపాడుకోవాలని, వారి గురించి శ్రద్ధ కనబరచాలని సీఎం జగన్ కు హితవు పలికారు.