Jayesh Ranjan: ‘ఫేక్ న్యూస్’పై కార్యాచరణ ప్రారంభించాం: తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
- ‘కరోనా’ను ఓ మతానికి ఆపాదించవద్దు
- పాత వీడియోలను ప్రస్తుత ఘటనలుగా చూపిస్తూ దుష్ప్రచారం
- పాత వీడియోలను గుర్తించేందుకు 10 మంది రీసెర్చర్స్ ఉన్నారు
ఫేక్ న్యూస్’ పై ఓ కార్యాచరణ ప్రారంభించామని తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ‘కరోనా’ను ఓ మతానికి ఆపాదించవద్దని, పాత వీడియోలను ప్రస్తుతం జరిగిన ఘటనలుగా చూపిస్తూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు.
పాత వీడియోలను గుర్తించేందుకు 10 మంది రీసెర్చర్స్ ఉన్నారని, ‘ఫ్యాక్ట్ చెక్’ యాప్ ద్వారా తప్పుడు వార్తలను గుర్తించ వచ్చని, ‘ఫ్యాక్ట్ లీ’ అనే సంస్థతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఐటీలో 95 శాతం మంది ఉద్యోగులు ‘వర్క్ ఫ్రమ్ హోం’ పద్ధతిలో పనిచేస్తున్నారని వివరించారు.