Lockdown: తెలంగాణలో కరోనా కట్టడికి పోలీసుల త్రిముఖ వ్యూహం: డీజీపీ మహేందర్‌ రెడ్డి

telangana dgp about lockdown

  • నిబంధనల ఉల్లంఘన జరుగుతున్న ప్రాంతాల గుర్తింపు
  • వాహనాలు రహదారులపైకి రావడానికి గల కారణాలపై వివరాలు
  • ప్రాంతాల వారీగా ఉల్లంఘన కేసుల పరిశీలన
  • సీసీటీవీ కెమెరాల ద్వారా పలు ప్రాంతాల్లోని పరిస్థితుల గుర్తింపు

తెలంగాణలో కరోనా కట్టడికి ఇప్పటికే పకడ్బందీ చర్యలు తీసుకున్న పోలీసులు ఇప్పుడు మరిన్ని చర్యలకు సిద్ధమవుతున్నారు. లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేసేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ... నిబంధనలు ఉల్లంఘిస్తోన్న ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు తెలిపారు.

పలు ప్రాంతాల్లో జనాలు అధిక సంఖ్యలో గూమికూడడంతో పాటు వాహనాలు అధికంగా రహదారులపైకి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్లు మహేందర్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణలోని పట్టణాలు, జిల్లా కేంద్రాలతో పాటు నగరాల వారీగా ఉల్లంఘన కేసులను పరిశీలిస్తున్నామని తెలిపారు.

సీసీటీవీ కెమెరాల ద్వారా పలు ప్రాంతాల్లోని పరిస్థితులను  పరిశీలిస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘన ఘటనలు జరుగుతున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణలో పోలీసులు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారని, వారి కుటుంబ సభ్యుల కోసం టెలీ హెల్త్‌ కన్సల్టేషన్‌ సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు.

  • Loading...

More Telugu News