CPI Ramakrishna: ఏపీ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ను తీసుకురావడం కరెక్టు కాదు: సీపీఐ రామకృష్ణ

CPI Rama Krishna criticises Ap Government for new ordinance

  • కక్షపూరిత చర్యలు, నిరంకుశ విధానాలు తగవు
  • ఎస్ఈసీ తమకు అనుకూలంగా లేరని ప్రభుత్వం భావించింది
  • అందుకే, కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామక అర్హత నిబంధనలు మార్చేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు రావడంపై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. ఆ ఆర్డినెన్స్ తీసుకురావడం కరెక్టు కాదని, కక్షపూరిత చర్యలు, నిరంకుశ విధానాలు తగవని విమర్శించారు.

‘కరోనా’ విపత్తు వల్ల జరిగే ప్రమాదాన్ని ముందుగానే గ్రహించడం వల్లే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ వాయిదా వేశారని అన్నారు. ఎస్ఈసీ తమకు అనుకూలంగా లేరని ప్రభుత్వం భావించడం వల్లే ఈ పని చేసిందని, ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మొన్న నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ రావును, ఇవాళ నగరి మున్సిపల్ కమిషనర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News