KCR: లాక్ డౌన్ ను రెండు వారాలు పొడిగించండి: కేసీఆర్

KCR suggests Modi to extend lockdown for 2 weeks

  • కరోనాపై యుద్ధంలో భారత్ గెలుస్తుంది
  • రైతులు నష్టపోకుండా చూడాలి
  • కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి

ప్రస్తుత లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కేసీఆర్ మాట్లాడుతూ, కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో లాక్ డౌన్ చాలా ఉపయోగపడిందని చెప్పారు. కరోనాపై యుద్ధంలో భారత్ గెలుస్తుందని అన్నారు. రాష్ట్రాలు చెల్లించాల్సిన అప్పుల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలని కోరారు. చెల్లింపులను 6 వారాలు వాయిదా వేయాలని విన్నవించారు.

లాక్ డౌన్ సమయంలో రైతులు నష్టపోకుండా చూడాలని, ప్రజల నిత్యావసరాలకు ఇబ్బంది కలగకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిచేలా చూడాలని కేసీఆర్ కోరారు. వచ్చే ఖరీఫ్ లో విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని విన్నవించారు. ఆయిల్ మిల్లులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నడిచేలా చూడాలని అన్నారు. వ్యవసాయ రంగాన్ని నరేగాతో అనుసంధానం చేయాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని... కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని చెప్పారు.

  • Loading...

More Telugu News