Somireddy Chandra Mohan Reddy: కనీసం అప్పుడైనా నైతిక విలువలు గుర్తుకొస్తాయేమో చూద్దాం: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

somireddy fires on jagan

  • నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తప్పించారు
  • ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై వేటు వేశారు
  • ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు వేశారు
  • కోర్టుల్లో జగన్‌ తీరుకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు.

'రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై వేటు వేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు వేశారు. చివరికి జగన్‌కు అడ్డమొస్తే శాసన మండలిని కూడా రద్దు చేశారు. వీటన్నింటిపై ఎన్ని కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చాయి?' అని ప్రశ్నించారు.

'ఒకరోజు రమేశ్‌ కుమార్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదే రోజు రెండు హైకోర్టు తీర్పులు వచ్చాయి. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం పశ్చాత్తాపపడలేదు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ని తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ మీరింకా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఎన్నికల కమిషనర్‌ తొలగింపుపై రేపు మరో సారి జగన్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే కనీసం అప్పుడైనా నైతిక విలువలు గుర్తు కొస్తాయేమో చూద్దాం' అని విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News