Venkaiah Naidu: ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఉత్తమమైంది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Vice president of India comments on Lock down extension

  • లాక్ డౌన్ 1.0 లో సాధించిన ఫలితాలను కాపాడుకోవాలి
  • అందుకోసం లాక్ డౌన్ కొనసాగించాలి
  • ‘కరోనా’ సవాల్ ను అధిగమించేందుకు మరింత నిబద్ధతతో ఉండాలి

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మరో మారు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదని కొనియాడారు.

లాక్ డౌన్ 1.0 లో సాధించిన ఫలితాలను కాపాడుకోవడానికి లాక్ డౌన్ కొనసాగించాలని అన్నారు. లాక్ డౌన్ 2.0 నుంచి ఆశించిన ఫలితాలు సాధించడమనేది ప్రజల చేతుల్లోనే ఉందని, ‘కరోనా’ మహమ్మారి సవాల్ ను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ మరింత నిబద్ధతతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరీక్షా సమయంలో మనం చేస్తున్న పోరాటంపైనే లాక్ డౌన్ ఎత్తివేత ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.

 ఆర్థికంగా, దుర్భరమైన వర్గాల జీవనోపాధి గురించి జాగ్రత్తలు తీసుకుంటానని ప్రధాని హామీ ఇచ్చారని, రైతులు, వ్యవసాయ కార్మికుల కోసం అవసరమైన చర్యలను కూడా తీసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. మెరుగైన భవిష్యత్ కోసం కొన్ని కష్టాలు భరించక తప్పదని, ‘కరోనా’పై  పోరాడే వ్యవధిని నిర్ణయించడం అన్నది మనపైనే ఆధారపడి ఉందని, దీనిపై పోరులో మనం చివరికి విజయం సాధిస్తామని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News