Nara Lokesh: ఈమె వీడియో చూస్తే మానవత్వంపై తిరిగి నమ్మకాన్ని నింపుకోవచ్చు: నారా లోకేశ్

It is visuals like these during the lockdown lokesh

  • పోలీసులకు కూల్‌ డ్రింక్స్‌ ఇవ్వబోయిన మహిళ
  • ఆమె జీతం ఎంత? అని అడిగిన పోలీసులు
  • రూ.3500 అని చెప్పిన మహిళ
  • పెద్ద మనసు అని ప్రశంసించిన పోలీసులు

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో రాత్రింబవళ్లు పోలీసులు విధులు నిర్వహిస్తూ నిబంధనలు అమలయ్యేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ పోలీసులకు కూల్‌ డ్రింకు బాటిళ్లు ఇస్తుండగా తీసిన వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.

లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు ఓ మహిళ కూల్‌ డ్రింకుల సీసాలు అందించింది. మొదట థమ్సప్‌ బాటిల్‌ను ఆమె పోలీసులకు ఇచ్చింది. అనంతరం ఫాంటా బాటిల్‌ను కూడా తీసి ఇవ్వబోయింది. అప్పుడు 'నీ జీతం ఎంత?' అని ఆమెను పోలీసులు అడిగారు. దానికి ఆమె 3,500 రూపాయలు అని చెప్పింది. అంత తక్కువ జీతం పొందుతోన్న ఆమె తమకు సేవ చేయాలనుకోవడంపై పోలీసులు ప్రశంసలు కురిపించారు. ఆమెది చాలా పెద్ద మనసు అని అన్నారు. చివరకు వాటిని పోలీసులు తీసుకోలేదు.

'లాక్‌డౌన్‌ నేపథ్యంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ఈ దృశ్యాలు మానవత్వంపై మనలో తిరిగి నమ్మకాన్ని నింపేలా ఉన్నాయి. ఆమె ఇస్తున్న స్ఫూర్తిని అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన చిరునవ్వులు చిందిస్తూ ఆమె పోలీసులకు వాటిని అందించాలనుకుంది' అని లోకేశ్ ట్వీట్ చేశారు.    

  • Loading...

More Telugu News