Love Agarwal: రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలి: లవ్ అగర్వాల్
- లాక్ డౌన్ లో పని చేసే సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నాం
- ఎక్కడా అత్యవసరాలకు కొరత రాకుండా చూస్తున్నాం
- ‘మేకిన్ ఇండియా’ ద్వారా వైద్య పరికరాల తయారీపై దృష్టి సారించాం
లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయా రాష్ట్రాలను కోరామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లాక్ డౌన్ లో పని చేసే సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నామని, ఎక్కడా అత్యవసరాలకు కొరత రాకుండా చూస్తున్నామని, వలస కూలీలకు ఆహారం, నిత్యావసరాలు సమకూరుస్తున్నామని అన్నారు. కంటైన్ మైంట్ జోన్లలో ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.9 లక్షల మందికి పైగా ‘కరోనా’ పరీక్షలు నిర్వహించామని వివరించారు. మేకిన్ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీపై దృష్టి సారించామని చెప్పారు.