Corona Virus: కరోనా వైరస్ ల్యాబ్ లో పుట్టిందా? అనేది తేలుస్తామన్న ట్రంప్... ఖండించిన చైనా

Trump slams China over corona virus issue

  • కరోనా అంశంలో చైనా, అమెరికా మధ్య వార్
  • వ్యాప్తికి కారణం మీరంటే మీరని ఆరోపణాస్త్రాలు
  • చైనా నిజాలు వెల్లడించాలన్న అమెరికా
  • అమెరికా ఆరోపణలు వాస్తవదూరం అంటున్న చైనా

కరోనా వైరస్ జననం, వ్యాప్తి విషయంలో చైనా, అమెరికా మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. అమెరికా సైనికుల కారణంగానే కరోనా వైరస్ వ్యాప్తి మొదలైందని చైనా, ఇది చైనా వైరస్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

తాజాగా, ట్రంప్ మరోసారి దూకుడైన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ల్యాబ్ లో పుట్టిందా? అనే విషయం తేల్చుకుంటామని చైనాను రెచ్చగొట్టారు. అటు ట్రంప్ సన్నిహితుడు, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సైతం ఇదే స్పందన కనబర్చారు. కరోనా వైరస్ వాస్తవాలను చైనా ఇకనైనా వెల్లడించాలని అన్నారు. అయితే దీనిపై చైనా వర్గాలు ఘాటుగా స్పందించాయి. కరోనా వైరస్ ల్యాబ్ లో ఉద్భవించిందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెప్పిందని చైనా పునరుద్ఘాటించింది. అమెరికా ఆరోపణలు సత్యదూరమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News