Tollywood: పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపణీ చేసిన దిల్ రాజు

Dilraju Distributed protective masks and sanitizers to the police department
  • మెహిదీపట్నం రైతు బజారు వద్ద అందజేత
  • కరోనా నేపథ్యంలో సేవా కార్యక్రమాల్లో ముందున్న నిర్మాత
  • ఇప్పటికే సీఎం సహాయ నిధికి రూ. 10 లక్షలు ఇచ్చిన రాజు
కరోనా వైరస్‌పై పోరాటంలో సినీ ప్రముఖులు తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల విరాళం అందజేసిన ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు అంతటితో ఆగకుండా మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

తాజాగా పోలీసు సిబ్బందికి రక్షణ మాస్కులు, శానిటైజర్లు పంపణీ చేశారు. మెహిదీపట్నం రైతు బజారు వద్ద ఈ రోజు ఉదయం పోలీసు డిపార్ట్‌మెంట్‌కు దిల్‌ రాజు వీటిని అందజేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్వీట్ చేసింది. మనల్ని రక్షించే వారిని కాపాడుకోవడం మన బాధ్యత అని పేర్కొంది. రెండు రోజుల కింద జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కూడా దిల్ రాజు మాస్కులు, శానిటైజర్లు అందించారు.
Tollywood
producer
Dil Raju
distributed
masks
sanitizers
Police

More Telugu News