pensioners: పెన్షనర్ల పట్ల దయతో వ్యవహరించాలి.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచన

pensioners case hering in telangana highcourt

  • కరోనా కష్టకాలమంటూ కోత విధించిన తెలంగాణ ప్రభుత్వం
  • ఏ ప్రాతిపదికన కోత వేశారని ప్రశ్నించిన కోర్టు
  • ఈనెల 24వ తేదీకి విచారణ వాయిదా

పింఛన్‌పైనే ఆధారపడి జీవించే విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కాస్త దయతో వ్యవహరించాల్సి ఉందని, అటువంటి వారి పింఛన్లలో కోత విధిస్తూ ఏ ప్రాతిపదికన నిర్ణయించారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా కష్టకాలమంటూ విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో యాభై శాతం కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
 
దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు ఈ రోజు విచారించింది. ‘ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు. లాక్‌డౌన్‌ కాలంలో విశ్రాంత ఉద్యోగులకు సమస్యలు వస్తే ఎవరు ఆదుకుంటారు? అందువల్ల పూర్తి పెన్షన్‌ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించండి’ అంటూ అడ్వకేట్‌ జనరల్‌కు కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News