Indian Navy: ఇండియన్ నేవీలో కలకలం... 21 మందికి కరోనా పాజిటివ్!

21 sailors in Indian Navy tests Corona Positive

  • నేవీలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి
  • బ్లాక్ మొత్తాన్ని క్వారంటైన్ లో ఉంచిన అధికారులు
  • కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో తలమునకలు

భారత నావికాదళంలో కలకలం చెలరేగింది. నేవీలోని 21 మంది సెయిలర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ముంబైలోని నేవల్ హాస్పిటల్ లో వీరిని క్వారంటైన్ చేశారు. ఇండియన్ నేవీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. సెయిలర్స్ తో కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు.

ఈ సందర్భంగా నేవీ ఒక అధికారిక ప్రకటన చేసింది. యుద్ధ నౌకల్లో ఉన్న అధికారులు, సెయిలర్లు ఎవరికీ కరోనా రాలేదని వెల్లడించింది. ప్రస్తుతం కరోనా బారిన పడిన సెయిలర్లంతా ఒడ్డున (ఐఎన్ఎస్ యాంగ్రే షోర్ బేస్డ్ డిపో) ఉన్నవారేననని తెలిపింది. లాజిస్టిక్స్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ విభాగాల్లో వీరు విధులను నిర్వర్తిస్తున్నారని చెప్పింది. సెయిలర్లకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ భాగం అసింప్టొమేటిక్ (ఇన్ఫెక్షన్ లక్షణాలు కనపడని) అని తెలిపింది. కేసులు బయటపడిన వెంటనే బ్లాకు మొత్తాన్ని అధికారులు క్వారంటైన్ లో ఉంచారు.

  • Loading...

More Telugu News