Devineni Uma: ర్యాపిట్ కిట్ల కొనుగోలులో మీ సూట్ కేసు కంపెనీల విజ్ఞాన ప్రదర్శన ఏమీ లేదు కదా?: దేవినేని

Devineni Uma questions over rapid testing kits imported from South Korea
  • దక్షిణ కొరియా నుంచి రాష్ట్రానికి లక్ష కిట్లు రాక
  • ఛత్తీస్ గఢ్ తెప్పించిన కిట్ రూ.337 మాత్రమేనన్న ఉమ
  • ఏపీ అధికారులు, ఆరోగ్యాంధ్ర తలో మాట చెబుతున్నారని విమర్శలు
ఏపీ సర్కారు దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించడంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శనాస్త్రాలు సంధించారు. "ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రూ.337కి తెప్పించుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను మీ అధికారులు రూ.640 అంటున్నారు. మీ ఆరోగ్యాంధ్ర రూ.700 పెట్టి తెప్పించాం అంటోంది. ఇందులో మీ సూట్ కేసు కంపెనీల విజ్ఞాన ప్రదర్శన ఏమీ లేదు కదా?" అంటూ సందేహం వ్యక్తం చేశారు. "ఈ విషయంలో ఏది వాస్తవం అనేది రాష్ట్రం తెలుసుకోవాలనుకుంటోంది సీఎం జగన్ గారూ!" అంటూ ఉమ ట్వీట్ చేశారు.
Devineni Uma
Rapid Testing Kits
Chhattisgarh
South Korea
Andhra Pradesh
Corona Virus

More Telugu News