Rajamouli: హమ్మయ్య, నా టాస్క్ పూర్తయింది... ఇక తారక్, చరణ్ వంతు!: రాజమౌళి

Rajamouli challenges Tarak and Ramcharan

  • లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు
  • రాజమౌళికి 'బీ ద రియల్ మ్యాన్' చాలెంజ్ విసిరిన సందీప్ వంగా
  • చీపురు, చేటతో ఇంటిని క్లీన్ చేసిన రాజమౌళి

దర్శకుడు వంగా సందీప్ విసిరిన 'బీ ద రియల్ మ్యాన్' చాలెంజ్ స్వీకరించిన రాజమౌళి లాక్ డౌన్ సమయంలో తన ఇంటిని పరిశుభ్ర పరిచారు. చీపురు, చేట చేతబట్టి ఇంట్లోని దుమ్ము, ధూళి అంతుచూశారు. అంతేకాదు, తడిగుడ్డతో టైల్స్ ను తళతళలాడేలా తుడిచారు. ఆపై విజయగర్వంతో  పోజిచ్చారు. దీనిపై ట్విట్టర్ లో పోస్టు చేసిన రాజమౌళి... నా టాస్క్ పూర్తయింది సందీప్ వంగా! ఇక, తారక్, రామ్ చరణ్ లను చాలెంజ్ చేస్తున్నాను. శోభు యార్లగడ్డ, సుకుమార్, పెద్దన్న కీరవాణిలకు కూడా ఈ చాలెంజ్ విసురుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఇటీవల తన ఇంట్లో అంట్లు తోముతూ ఆడవాళ్లకు సహకరించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News