Swiggy: నిషేధించినా ఫుడ్ డెలివరీలు చేస్తున్న స్విగ్గీ, జొమాటో... వాహనాలు సీజ్ చేసిన హైదరాబాద్ పోలీసులు!

Food Delivery Boys Vehicles Sease by Police

  • తెలంగాణలో ఫుడ్ డెలివరీపై నిషేధం
  • అయినా ఆర్డర్స్ తీసుకుంటూ ఆహార సరఫరా
  • ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి అడ్డుకట్ట వేసిన పోలీసులు

స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్ లో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో, వీటిని తెలంగాణ నిషేధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ఫుడ్ డెలివరీలను చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు.

వద్దన్నా ఫుడ్ డెలివరీలను కొందరు చేస్తుండగా, నిబంధనలను ధిక్కరించిన వారిని పట్టుకునేందుకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, డెలివరీ బాయ్స్ వాహనాలను వచ్చినవి వచ్చినట్టు సీజ్ చేసి, కేసులను నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, వాటిని మీరితే, చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిషేధం విధించినా, ఆర్డర్స్ తీసుకుంటున్న ఫుడ్ డెలివరీ యాప్స్ పైనా కేసులు నమోదు చేయనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

  • Loading...

More Telugu News