WEP: 26.5 కోట్ల మందికి ఆకలి బాధ... కరోనా కారణంగా రెట్టింపు అవుతుందన్న ఐరాస!

Global Hunger People Could Double due to Corona

  • గత సంవత్సరం 13 కోట్ల మందికి ఆకలి బాధ
  • టూరిజం, రవాణా రంగాలపై ఆధారపడిన వారికి ఉపాధి కరవు
  • ఆకలితో మగ్గిపోయే వారి సంఖ్య పెరుగుతుందని హెచ్చరిక

గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరం ఆహార భద్రతను కోల్పోయిన వారి సంఖ్య రెట్టింపు అయిందని ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని డబ్ల్యూఎఫ్ పీ (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్) వ్యాఖ్యానించింది. గత సంవత్సరం  ఆకలి బాధను 13 కోట్ల మంది అనుభవించగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 26.5 కోట్లకు చేరుతుందని పేర్కొంది.

ముఖ్యంగా టూరిజంపై ఆధారపడిన ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలపై ఈ ప్రభావం అధికంగా ఉందని, ప్రజా రవాణా నిలిచిపోవడంతో ప్రయాణికులపై ఆధారపడి, వారికి పలు రకాల ఆహార ఉత్పత్తులను అమ్ముకుంటూ బతుకు వెళ్లదీస్తున్న వారూ ఆకలితో మగ్గిపోతున్నారని వెల్లడించింది. లాక్ డౌన్ మొదలైన నెల రోజుల వ్యవధిలోనే ఆకలితో అలమటిస్తున్న వారి జాబితాలో 13.5 కోట్ల మంది చేరిపోయారని డబ్ల్యూఎఫ్ పీ రీసెర్చ్ విభాగం డైరెక్టర్ ఆరిఫ్ హుస్సేన్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News