RGV: అప్పుడు పుస్తకాల పురుగు, ఇప్పుడు కరోనా పురుగును విశ్లేషిస్తున్నారు.. ఆర్జీవీపై కీరవాణి ట్వీట్

 Pusthakaala Purugu Now busy analysing Corona purugu MM Keeravani tweet on RGV

  • 1988లో ఆర్జీవీ నాకు పుస్తకాల పురుగుగా తెలుసు
  • సార్, మీరు ఇంకా స్టీఫెన్ కింగ్ పుస్తకాలు చదువుతున్నారా?
  •  ట్విట్టర్లో ప్రశ్నించిన సంగీత దర్శకుడు

కరోనా వైరస్‌పై ఈ మధ్య  తనదైన శైలిలో స్పందిస్తున్న ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘1988లో ఆర్జీవీ నాకు పుస్తకాల పురుగుగా  తెలుసు. ఇప్పుడు ఆయన కరోనా పురుగును విశ్లేషించే పనిలో ఉన్నారు. సార్, మీరు ఇంకా స్టీఫెన్ కింగ్ పుస్తకాలు చదువుతున్నారా?’ అని ట్వీట్ చేశారు.

అంతకుముందు తనకు నచ్చిన ప్రముఖ పుస్తకాల పేర్లు చెప్పాలని డైరెక్టర్ క్రిష్ ట్విట్టర్లో తనను నామినేట్ చేశారని కీరవాణి చెప్పారు. ఈ మేరకు.. ‘పోలీసు చమత్కారం’, ‘కన్యాశుల్కం’,  ‘స్టీఫెన్ కింగ్ నైట్ షిఫ్ట్’,  ‘వంశీ మా పసలపూడి కథలు’  తనకు బాగా నచ్చిన, పదే పదే చదివే పుస్తకాలని తెలిపారు. తమకు నచ్చిన పుస్తకాలు ఏమిటో చెప్పాలని ఆర్జీవీ, ఎస్ఎస్ కాంచి, గుణశేఖర్ లను ఆయన నామినేట్ చేశారు.

  • Loading...

More Telugu News