Brazil: బ్రెజిల్ లో దయనీయం... కొత్త కేసులకు ఖాళీ లేదంటున్న ఆసుపత్రులు!

Hospitals says no for new corona cases in Brazil

  • బ్రెజిల్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,995
  • ఇప్పటివరకు 3600 మంది మృతి
  • కరోనా రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
  • భౌతికదూరం అక్కర్లేదంటున్న దేశాధ్యక్షుడు

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచిన బ్రెజిల్ ఇప్పుడు కరోనా కారణంగా విలవిల్లాడుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పుడక్కడ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,995 కాగా, 3,600 మంది మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు వస్తుండడంతో అక్కడి ఆసుపత్రులు స్థాయికి మించి సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కొత్త కేసులను చేర్చుకోలేమంటూ ఆసుపత్రులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని నగరం రియో డి జనీరోలో ఏ ఆసుపత్రి చూసినా కొవిడ్-19 రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇతర నగరాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది.

ఆసుపత్రుల సంగతి అటుంచితే, మార్చురీల్లో సైతం ఖాళీ ఉండడంలేదు. అటు శ్మశాన వాటికలు సైతం కరోనా మృతుల తాకిడి ఎదుర్కొంటున్నాయి. మానాస్ సిటీలో భారీ గోతులు తీసి వాటిలో సామూహిక ఖననం చేస్తున్నారు. బ్రెజిల్ వాస్తవ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, అధ్యక్షుడు జైర్ బొల్సొనారో తీరు విచిత్రంగా ఉంది. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, ముప్పు ఉన్నవారిని ఐసోలేషన్ చేస్తే సరిపోతుందని సెలవిస్తున్నారు.

  • Loading...

More Telugu News