Lockdown: రాష్ట్రపతి ఆదేశాలు... వందల కిలోమీటర్లు కారులో ప్రయాణించిన మహారాష్ట్ర. మేఘాలయ ప్రధాన న్యాయమూర్తులు!
- లాక్ డౌన్ కష్టం ఎవరికైనా ఒకటే
- బాంబే, మేఘాలయా హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు
- ఉన్న పళంగా బయలుదేరిన బిశ్వనాథ్ సోమద్దర్, దీపాంకర్ దత్తా
లాక్ డౌన్ కష్టాలు ఎవరికైనా ఒకటేనని తెలిపే ఘటన ఇది. కోల్ కతాలో హైకోర్టులో పనిచేస్తున్న దీపాంకర్ దత్తాకు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అలహాబాద్ లో పనిచేస్తున్న బిశ్వనాథ్ సోమద్ధర్ కు మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేయడంతో, వారు ఉన్నపళాన, కుటుంబ సభ్యులతో కలిసి వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.
కోల్ కతాను వదిలి ప్రయాణం ప్రారంభించిన దీపాంకర్ దత్తా రేపు మధ్యాహ్నానికి ముంబై చేరుకోనున్నారు. మరోవైపు అలహాబాద్ నుంచి కోల్ కతా చేరుకున్న బిశ్వనాథ్ సోమద్దర్, రోడ్డు మార్గాన నేడు షిల్లాంగ్ కు చేరుకోనున్నారు. కాగా, రాష్ట్రపతి ఆదేశాల మేరకు గురువారం నాడు వీరు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.