Tollywood: పేదల ఆకలి తీరుస్తున్న టాలీవుడ్ భామ ప్రణీత

Pranitha Subhash serves 75000 meals in 21 days since lockdown

  • లాక్‌డౌన్‌లో పేదల కోసం స్వయంగా వంట చేస్తున్న నటి ప్రణీత
  • 21 రోజుల్లో 75 వేల ఆహార పొట్లాల పంపిణీ
  • ఇది వరకే ఆర్థిక సాయం, నిత్యావసరాల అందజేత

టాలీవుడ్ నటి ప్రణీత  మంచి మనసు చాటుకుంటోంది. పవన్‌ కల్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రణీత లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజల ఆకలి తీరుస్తోంది. తానే స్వయంగా వంట చేసి, వండిన పదార్థాలను ప్యాకింగ్ చేసి అవసరం ఉన్నవారికి చేరవేస్తోంది.

లాక్‌డౌన్ మొదలైన తర్వాత 21 రోజుల్లోనే ఆమె 75 వేల ఆహార పొట్లాలను అందజేసింది. ముఖానికి మాస్కు ధరించి వంట చేస్తూ, ప్యాకింగ్ చేస్తున్న ఫొటోలను ప్రణీత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఆమె చేస్తున్న మంచి పనిపై వాళ్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రణీత ఇది వరకే యాభై కుటుంబాలకు సాయం చేసేందుకు రూ. లక్ష విరాళం ప్రకటించింది. దాంతో పాటు పలువురికి నిత్యావసరాలు కూడా అందజేసింది.

  • Loading...

More Telugu News