Prakash Raj: ప్రకాశ్ రాజ్ తనయుడి మామిడి కాయల వ్యాపారం!

Prakash Raj posts an adorable pic of his son
  • దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 
  • ఫాంహౌస్ లో ఉంటున్న ప్రకాశ్ రాజ్ ఫ్యామిలీ
  • కొడుకు ఫొటో ట్వీట్ చేసిన నటుడు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై నెల రోజులు దాటిపోయింది. లాక్ డౌన్ ప్రకటించడంతో చాలామంది సినీ ప్రముఖులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రముఖ దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ తన కుటుంబంతో కలిసి హైదరాబాదు సమీపంలోని ఫాంహౌస్ లో ఉంటున్నారు. తన వ్యవసాయక్షేత్రంలో పొలం పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. అందులో ప్రకాశ్ రాజ్ కుమారుడు వేదాంత్.. చుట్టూ మామిడి కాయలు పెట్టుకుని అమ్ముతున్న వాడిలా కనిపిస్తున్నాడు. అవన్నీ కూడా ప్రకాశ్ రాజ్ తోటలో కాసినవే. "నా బిడ్డ... మామిడి కాయల వ్యాపారి! మా వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతితో సంభాషిస్తున్నా. ఇంటి వద్దే ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈ విపత్తు సమసిపోతుంది" అంటూ ట్వీట్ చేశారు.
Prakash Raj
Vedanth
Mangoes
Farmhouse
Lockdown
Corona Virus

More Telugu News