Sensex: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex ends 371 points higher

  • 371 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 99 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 15 శాతానికి పైగా పుంజుకున్న ఇండస్ ఇండ్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 371 పాయింట్లు లాభపడి 32,115కి పెరిగింది. నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 9,381కి ఎగబాకింది. ఫైనాన్స్ సూచీ 3.53 శాతం, బ్యాంకెక్స్ సూచీ 2.94 శాతం లాభపడ్డాయి  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (15.11%, బజాజ్ ఫైనాన్స్ (9.04%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (7.74%), యాక్సిస్ బ్యాంక్ (6.61%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.44%).

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-3.27%), ఎన్టీపీసీ (-2.11%), నెస్లే ఇండియా (-2.09%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.32%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.30%).

  • Loading...

More Telugu News