Venkaiah Naidu: పరిస్థితులు కుదుటపడ్డాకే పార్లమెంట్ సమావేశాలు: రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు
- రాజ్యసభ సభ్యులతో మాట్లాడిన వెంకయ్యనాయుడు
- దేశంలో ‘కరోనా’ పరిస్థితులు కుదుటపడాలి
- క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పరిశీలన తర్వాతే సమావేశాలు
దేశంలో ‘కరోనా’ పరిస్థితులు కుదుటపడిన తర్వాతే పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. ‘మిషన్ కనెక్ట్’లో భాగంగా రాజ్యసభ సభ్యులతో ఈరోజు ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పరిశీలించిన అనంతరం పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
కాగా, ‘మిషన్ కనెక్ట్’ లో భాగంగా మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ప్రధాన న్యాయమూర్తులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, రాజకీయ నేతలతో వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యులతో ఆయన మాట్లాడారు.