Maharashtra: సదుపాయాలు లేవంటూ ఐసోలేషన్ కేంద్రం నుంచి రోగి పరారీ

Corona patient escaped from Isolation center in pune

  • మహారాష్ట్రలోని పూణెలో ఘటన
  • తిండి సరిగా పెట్టడం లేదని తప్పించుకున్న వైనం
  • 17 కిలోమీటర్లు నడుచుకుంటూ  ఇంటికి

తనను ఉంచిన ఐసోలేషన్ కేంద్రంలో సరైన సదుపాయాలు లేవన్న కారణంతో కరోనా రోగి అయిన వృద్ధుడు అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిందీ ఘటన. నగరానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఆయనను ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అయితే, అక్కడ సరిగా తిండిపెట్టకపోవడం, కేంద్రం శుభ్రంగా లేకపోవడంతో అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. నడుచుకుంటూ 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకుని బయట కూర్చున్నాడు.

గమనించిన చుట్టుపక్కల వారు ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు అతడి ఇంటికి చేరుకుని మళ్లీ ఐసోలేషన్ కేంద్రానికి పంపేందుకు ప్రయత్నించగా రానని మొండికేశాడు. దీంతో అతడి కుమారుడితో మాట్లాడించి ఒప్పించడంతో తిరిగి వెళ్లేందుకు అంగీకరించాడు. ఐసోలేషన్ కేంద్రం నుంచి నడిచి వచ్చే సమయంలో తాను ఎవరినీ కలవలేదని చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News