Chandrababu: చంద్రబాబు పీఏపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత విద్యాసాగర్
- లోన్లు తీసుకుని స్వాహా చేశారంటూ మనోహర్ పై ఫిర్యాదు
- కలకలం రేపుతున్న కుప్పం టౌన్ బ్యాంకు స్కాం
- ఇప్పటికే నలుగురు బ్యాంక్ సస్పెన్షన్
టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ మనోహర్ పై వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పంలోని తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై మనోహర్ రూ. 12 లక్షల లోన్ తీసుకున్నారని.. ఆ డబ్బును స్వాహా చేసేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
మరోవైపు కుప్పం టౌన్ బ్యాంకులో రూ. 1.9 కోట్ల స్కాం జరిగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లపై కొందరు ప్రముఖులు లోన్లు తీసుకుని స్వాహా చేశారని చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మేనేజర్, అప్రైజర్ మరో ఇద్దరు సిబ్బంది కూడా ఈ స్కాంలో ఉన్నట్టు సమాచారం. దీంతో, ఈ నలుగురిని బ్యాంకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మనోహర్ పై విద్యాసాగర్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.