rashi khanna: తన గురించి వెబ్సైట్లలో వస్తోన్న వార్తలపై హీరోయిన్ రాశి ఖన్నా స్పందన
- 'వరల్డ్ ఫేమస్ లవర్'లో రొమాంటిక్ సీన్లు
- మరోసారి అటువంటి సీన్లలో నటించబోనని రాశి ఖన్నా చెప్పినట్లు వార్తలు
- కొట్టిపారేసిన హీరోయిన్
- బాధపడుతూ ఏ సినిమాలోనూ నటించలేదని వ్యాఖ్య
విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ఫిబ్రవరి 14న విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి చేసిన రొమాంటిక్ సన్నివేశాల గురించి రాశి ఖన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిందని, ఇకపై అటువంటి హద్దులు మీరే సీన్లలో నటించబోనని ఆమె స్పష్టం చేసిందంటూ కొన్ని వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి.
వీటిపై ఆమె స్పందిస్తూ అసలు తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పింది. తాను నటించిన ప్రతి సినిమాను బాగా ఆస్వాదిస్తూ నటించానని, బాధపడుతూ మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదని చెప్పింది. సినిమాలు విజయం సాధించినా, సాధించకపోయినా ప్రతి ఒక్క సినిమా ఓ అందమైన ప్రయాణమని ఆమె తెలిపింది. ప్రతి సినిమా కొత్త విషయాలను నేర్పుతుందని ఆమె చెప్పింది. తామంతా నటులుగా ఇంకాస్త ఎదుగుతామని తెలిపింది. తానెప్పుడూ తాను పోషించిన పాత్రలపై సానుకూలంగానే ఉంటానని తెలిపింది.