Andhra Pradesh: పైచేయి కోసం తీసుకునే నిర్ణయాలతో నష్టం జరిగితే మీదే బాధ్యత: వర్ల
- ముఖ్యమంత్రి గారు! తొందరపడకండి.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి
- ‘స్థానిక’ ఎన్నికలు ఆలస్యమైనా ఇబ్బంది లేదు
- ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి
కరోనా వైరస్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నాయకుడు వర్ల రామయ్య సూచించారు. తొందరపాటు నిర్ణయాలు కాకుండా.. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తన పైచేయి కోసం తీసుకునే నిర్ణయాల వల్ల ఎవరికి నష్టం జరిగినా ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
‘ముఖ్యమంత్రి గారు! తొందరపడకండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమైనా ఇబ్బందిలేదు. మీ పైచేయి కోసం తీసుకునే నిర్ణయం వల్ల ఎవరికి నష్టం జరిగినా మీదే బాధ్యత. ఇప్పటికే ఊహించని నష్టం జరిగింది. అది ద్విగుణీకృతం కాకుండా చూచుకోండి’ వర్ల అని ట్వీట్ చేశారు.