Revanth Reddy: బావాబామ్మర్దులు ప్రారంభించిన ‘రంగనాయక సాగర్’ పరిస్థితి ఇదీ!: రేవంత్ రెడ్డి
- సిద్దిపేట జిల్లాలో ఉన్న రంగనాయక సాగర్ రిజర్వాయర్
- గత శుక్రవారమే రిజర్వాయర్ లోకి నీటిని వదిలిన కేటీఆర్, హరీశ్ రావు
- కోతకు గురై కూలిపోయిన మట్టికట్ట, రివిట్ మెంట్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ లోకి నీరు వెళ్లే దారిలోని మట్టికట్టతో పాటు రివిట్ మెంట్ కోతకు గురై నిన్న కూలిపోయిందంటూ వార్తలొచ్చాయి. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
‘పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిందట. బావ బామ్మర్దులు ప్రారంభించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఇదీ.. ’ అంటూ విమర్శలు చేశారు. ఇందుకు సంబంధించి ఓ వార్త పత్రికలో వచ్చిన కథనాన్ని జతపరిచారు. ఆ పత్రికలో కథనం ప్రకారం మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లు గత శుక్రవారం రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేశారు.