Mekapati Goutham Reddy: దేశంలోనే తొలిసారిగా ‘కరోనా’ బాధితులను ట్రాక్ చేసేందుకు కొత్త పరికరం రూపొందిస్తున్నాం: ఏపీ మంత్రి మేకపాటి

AP Minister Mekapati says We are developing a new device to track victims of corona

  • ‘కరోనా’ పేషెంట్ కు ఈ పరికరాన్ని అమర్చుతాం
  • జీపీఎస్ మాడ్యూల్ ను తయారు చేస్తాం
  • ఆ పేషెంట్ ను నిరంతరం ట్రాక్ చేయొచ్చు

ఏపీలో కరోనా వైరస్ కట్టడి నిమిత్తం మరో వినూత్న ఆలోచన చేశామని పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. దేశంలోనే తొలిసారిగా ‘కరోనా’ బాధితులను ట్రాక్ చేసేందుకు ఓ కొత్త పరికరాన్ని రూపొందిస్తున్నామని ‘కరోనా’ పేషెంట్ కు ఈ పరికరాన్ని అమర్చడం ద్వారా ఆ పేషెంట్ ను నిరంతరం ట్రాక్ చేయొచ్చని అన్నారు.

జీపీఎస్ మాడ్యూల్ ను తయారు చేస్తామని, ఇప్పటికే కంపెనీలతో చర్చించామని అన్నారు. భవిష్యత్ లో ఈ మాడ్యూల్ అవసరం చాలా ఉంటుందని, పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. గ్రీన్ జోన్ లో పరిశ్రమలు తెరిచేందుకు అనుమతులు ఇస్తున్నామని, రక్షణ చర్యలు చేపట్టి కార్మికులను అనుమతిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News